అంబేద్కర్ అందరివాడు – కొందరి వాడు కాదు

 

అంబేద్కర్ స్ఫూర్తితో పట్టుదలతో విద్యార్థులు చదువాలి

అంబేద్కర్ జీవిత చరిత్ర పై కళారూపక ప్రదర్శన కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారన్న

-…డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి

సంగారెడ్డి డిసెంబర్ 29 ప్రజ బలం ప్రతినిది:డి అశోక్. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి వారిచే ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ గారి జీవితం ఆశయం లక్ష్యాల కళారూపం సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన గురువారం రాత్రి సంగారెడ్డి అంబేద్కర్ భవన్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి.డి.అఖిలేష్ రెడ్డి గారు హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు.. ప్రదర్శన అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు – కొందరి వాడు కాదు అన్నారు. అంబేద్కర్ కళారూపక ప్రదర్శన అద్భుతంగా కళాకారులు ప్రదర్శించారని అన్నారు అంబేద్కర్ బాట అందరికీ అనుసరణీయం అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు.. కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్, న్యాయవాది రామారావు లు మాట్లాడుతూ మహనీయులు అంబేద్కర్ పూలే ఆశయాలను ముందుకు తీసుకపోవాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శంకర్, జమారుద్దిన్ , ఏ ఎస్ డబ్ల్యూ ఒ శంకర్ స్థానిక హెచ్ డబ్ల్యు ఓ లు మహేశ్వర్, రమేష్, రవి క్రిష్ణ, నాగేశ్వరరావు, కిరణ్ ,పిఎన్ఎం నాయకులు నాగభూషణం, దళిత సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…..

Leave A Reply

Your email address will not be published.

Breaking