అంబేద్కర్‌ గారిని కించపరిచిన అమిత్‌ షా ను 24 గంటలలో ఈ దేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి

ప్రజాబలం కొల్చారం మండలం డిసెంబర్‌ (19)మెదక్‌ జిల్లాకొల్చారం మండలం రంగంపేటలో రోడ్డు ఎక్కిన దళిత సంఘాలు
అమిత్‌ షా ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పనియెడల మా యెక్క
డిమాండ్స్‌ :
అమిత్‌ షా గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి.
అమిత్‌ షా గారి పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.
అమిత్‌ షా గారి పై దేశద్రోహం కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గారు ఎవరికి ఏ ఒక్క అస్తిత్వానికి మాత్రమే చెందిన వాడు కాదు.
ఆ విషయం మీకు తెలిసినా కూడా మీ యొక్క వక్ర బుద్ధితో మీరు ఈరోజు పార్లమెంట్లో అంబేద్కర్‌ గారి మీద చేసిన వ్యాఖ్యలను బట్టి మీరు మనువాద భావజాలంతో ఉన్నారని మరోసారి రుజువు అయింది .
అంబేద్కర్‌ అంటే అందరివాడు
అంబేద్కర్‌ అంటే సమూల సాంఘిక ప్రక్షాళన వాది.
అంబేద్కర్‌ అంటే ప్రతిఘటన యోధుడు.
అంబేద్కర్‌ అంటే యధాతధ వాదాన్ని కూలదోసినా ఆలోచనకర్త.
ఈ దేశ సామాజిక పరిస్థితులకు ఇంతవరకు ఎవరు కల్పించని, ఊహించని ఒక ఆలోచన దృక్పథాన్ని సృష్టించిన మహోపాధ్యాయుడు అంబేద్కర్‌ గారు…
భారతదేశ మౌలిక రాజకీయ నిర్మాణాన్ని చారిత్రక భౌతిక వాదంతో విశ్లేషించిన తత్వవేత్త అంబేద్కర్‌ గారు…
అన్నీ కలిపి వెరసి సాంఘిక విప్లవకారుడు అంబేద్కర్‌ గారు…
రాత మాత్రమే బతుకుదెరువుగా బతుకుతున్న బడుగు వర్గాల బాంధవుడు అంబేద్కర్‌ గారు.
అలాంటి అంబేద్కర్‌ గారిని మీరు ఈరోజు నిండు పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజుకి మీకు అంబేద్కర్‌ పై కోపాన్ని ,ద్వేషాన్ని చూపుతున్నారంటే మీరు ఎంతటి మనువాదులో ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు.


ఇప్పటికే మీకు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు దక్కకుండా దింపుడు గాలం మీద ఉన్నారు ఇకనైనా మీ బుద్ధి మార్చుకోకపోతే ఈ దేశ ప్రజలు మీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము.
వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి.
లేనియెడల ప్రధాని గారికి కూడా అంబేద్కర్‌ గారు అంటే గౌరవం లేదని ఈ దేశ ప్రజలకు రుజువు అవుతుంది..
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్‌, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి, ఆకుల పెంటయ్య, సీనియర్‌ జర్నలిస్టు గామిని జైపాల్‌, బిజెఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జీ యెహన్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోళ్ల సంజీవయ్య, టిఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్నగారి కృష్ణ, టిఎంఆర్పిఎస్‌ జిల్లా అధ్యక్షులు బంగరిగల్ల దుర్గయ్య, జిల్లా యువసేన నాయకులు, బాబయ్య, ఎంఎస్‌ఎప్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్‌, రవి, రమేష్‌, దళిత నాయకులు గంగరాములు, కే గంగరాములు, లక్ష్మణ్‌, బ్యాగరి భూమయ్య, ప్రశాంత్‌, ఏసు, జాను, నితిన్‌, ముత్యాలు, మల్లేశం, లకన్‌, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking