ఇళ్ల పట్టాల పంపిణీ : రూ.935 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్లు పథకం అమలు కోసం రూ. 935 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనానుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమికి పరిహారం చెల్లింపు కోసం రూ. 935 కోట్లు విడుదల చేసింది రెవెన్యూ శాఖ. సీసీఎల్ఏ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు భూసేకరణ నిమిత్తం చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ గృహవసతి పథకం నిమిత్తం 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఈ నిధులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేసింది ప్రభుత్వం. విడుదలైన మొత్తంలో రూ. 88.92 కోట్లు నిర్వహణా వ్యయం కూడా ఉన్నట్టు రెవెన్యూ శాఖ పేర్కొంది.

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment