నఖిలి విత్తనాలు,విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై రైతుకు అవగాహన కార్యక్రమం

 

మండల వ్యవసాయ శాఖ అధికారి సిఎచ్ ప్రభాకర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 27 : మంచిర్యాల లోని లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల,గుళ్ళకోట,సూరారం, చందారం వెంకట్రావుపేట గ్రామాలలో రైతులకు నకిలి విత్తనాలు,విత్తనాల కొనుగోలు లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది,లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయ రాదు,రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదు ను తప్పని సరిగా తీసుకోవాలి, విత్తన పాకెట్ మరియు బిల్లు ను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలి, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్స్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.విత్తన పాకెట్ మీద తయారయిన తేది,కాలం ముగిసే తేది చూసుకోవాలి.గ్రామాలలో తక్కువ ధర కు,ఎక్కువ ధరకు అమ్మి వారి వివరాలు మండల వ్యవసాయ అధికారికి తెలుపాలి.అని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి సి ఎచ్ ప్రభాకర్,వ్యవసాయ విస్తరణ అధికారులు గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న,ఇర్ఫాన యష్మీన్, శ్రీనివాస్,అనుష మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking