“andar bahar” జూదం ఆడుతూ పోలీసులకు పట్టుపడ్డ యువకులు

నిన్నటి దినము అనగా 14.12 2020 వ తేదీన సాయంత్రము సాదాపురం గ్రామం శివారు రైల్వే బ్రిడ్జి దగ్గర చెట్ల పొదల్లో కొందరు “andar bahar”అనే జూదం ఆడుతున్నారని రాబడిన సమాచారం పై ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఆదోని తాలూకా సిఐ పార్థసారథిగారి ఆధ్వర్యంలో ఆదోని తాలూకా ఎస్. ఐ నరేంద్ర కుమార్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ రెడ్డి మరియు కానిస్టేబుల్స్ వీర భాస్కర్ , ఉషేని,లేపాక్షి , రాము , ఇమాం, మునీర్ లు చాకచక్యంగా పేకాట ఆడుతున్న
షేక్ నూర్ అహ్మద్, గుమ్మల రాఘవేంద్ర, మహమ్మద్ నూర్ భాషా, రామదుర్గం సల్మాన్, జాబీర్ భాష, బాగోవోని అబ్దుల్ అహ్మద్ , కురువ శ్రీనివాసులు, సయ్యద్ నదీమ్ భాష, పొట్లపాడు వీరేష్, చాకోలి అక్రమ్ లను పట్టుకోని వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి మొత్తం రూ. 66,680/- ల నగదును, 13 మోటరు సైకిళ్లను మరియు 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అయినది. పేకాట నిర్వహించి ఆడిస్తూ పారిపోయిన పోకిరి @ మహబూబ్ తో పాటు పేకాట ఆడుతూ పారిపోయిన నాగరాజు, చాంద్, ఆర్టీసీ శాంతా, ఆటో సర్దార్, ముస్తఫా మరియు కొంతమంది పరారీలో ఉండగా వారిపై పోలీసు వారు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టడం అయినది. కావున గ్రామాల్లో ఎవరైనా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే, వారిపై తగు చర్య తీసుకుని రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తామని పోలీసువారి హెచ్చరిక. పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్న తాలూకా CI పార్థసారధి, SI నరేంద్ర కుమార్ రెడ్డి మరియు సిబ్బందిని DSP వినోద్ కుమార్ గారు అభినందించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking