వరంగల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేసిన యాంటీ డ్రగ్స్ టీం

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా నవంబర్ 7:వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం, ఇంతేజార్ గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగ్ లను పోలీసులు పోలీస్ జాగిలంటో తనిఖీ చేయించారు. ఈ సందర్బంగా యాంటీ డ్రగ్స్ టీం ఇంచార్జి ఇన్స్ స్పెక్టర్ సురేష్ ప్రయాణికులతో మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రహస్యం గంజాయి లాంటి మత్తు పదార్థాలను అక్రమ చేస్తున్న, విక్రయిస్తున్న, వినియోగిస్తున్న తక్షణమే 8712584473 సెల్ నంబర్ కు సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో యాంటీ డ్రగ్స్ టీమ్ ఇన్స్పెక్టర్స్ జె సురేష్, ఆర్ఐ శివ కేశవులు,ఆర్ఎస్ఐ పూర్ణ చంద్రా రెడ్డి,ఎస్ఐ చాంద్ పాషా,ఏఎస్ఐ సాంబయ్య మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking