దేశంలో ఎక్కడా లేని విధంగా 3,300 మంది ఆటోలకు పూర్తి స్థాయిలో బీమా పాలసీని బీమా పథకాలన్ని వర్తింప చేస్తూ,

 

ఎమ్మెల్యే సొంత ఖర్చులతో బీమా పథకాలన్నిఅందించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా 3, 300 మంది ఆటో పూర్తి అమలు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటోలకు ఉచిత పూర్తిస్థాయి బీమా పాలసీని అమలు చేస్తూ ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో సాహసోపేతంగా అందించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తీసుకున్న నిర్ణయం సర్వత్రా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని ఆటోలకు బీమా పథకాన్ని సొంత ఖర్చులతో సహసోపేతంగా అమలులోకి తీసుకువచ్చారు ప్రేమ్ సాగర్ రావు.ఈమేరకు దక్షత బీమా ఏజెన్సీతో మంచిర్యాల నియోజకవర్గంలోని 3,300 మంది ఆటోలకు బీమా పథకాన్ని వర్తింప చేస్తూ వారికి పాలసీ సర్టిఫికెట్లను అందజేశారు.జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ సభలో జిల్లా కలెక్టర్ సంతోష్,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డిప్యూటీ ట్రాన్సుపోర్టు అధికారి పుప్పాల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ మోతిలాల్,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ వేణు,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,బండారి సుధాకర్ ఆటో కార్మికులకు బీమా పాలసీ పత్రాలను సభా ముఖంగా అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రేమ్ సాగర్ రావు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అతి వేగంతో వెళ్లకుండా మద్యం సేవించకుండా సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… ఆటో డ్రైవర్ల సంక్షేమ కోసం నిరంతరం శ్రమిస్తానని భరోసా ఇచ్చారు. 1650 దరఖాస్తులు రాగా అందులో300 కరెక్టుగా ఉండగా 350 దరఖాస్తులు తప్పుగా వచ్చాయని మరో 350 మంది దరఖాస్తులు రాగా అందులో వారికి ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉండగా వాటి కాలపరిమితి తీరగానే వారికి బీమా పథకం వర్తింప చేస్తామని తెలిపారు. అంతే కాకుండా ఆటోడ్రైవర్ లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తానని డ్రైవర్ల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.లైసెన్స్ లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని ఆర్టీవో అధికారులను కోరగా డిప్యూటీ ట్రాన్సుపోర్టు అధికారి పుప్పాల శ్రీనివాస్ స్పందిస్తూ ఆర్టీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్,లేదా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడపవద్దని సూచించారు. అనంతరం డ్రైవర్లకు బీమా పాలసీలను అందజేశారు మిగతా డ్రైవర్లు దరఖాస్తులు చేసుకోవాలని,అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని సభాముఖంగా వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking