వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా బత్తుల వీరబాబు నియామకం

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 1 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో సోమవారం వడ్డెర సంఘం పాత కమిటీని రద్దుచేసి నూతన కమిటీ ఎన్నుకున్నారు . నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా రాయల సీతయ్య , ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా బత్తుల వీరబాబు , జిల్లా కార్యదర్శిగా కుంచపు వెంకటేశ్వర్లు మరియు 22 మందితో జిల్లా కమిటీని , 9 మంది సభ్యులతో క్రమశిక్షణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది . ముఖ్య అతిథులుగా విద్యావంతుల వేదిక రాష్ట్ర చైర్మన్ , కో చైర్మన్ ఇట్లు స్వర్ణ కుమార్ , చింతల జ్యోతి బసు మరియు రాష్ట్ర నాయకులు డేరంగుల బ్రహ్మం , తమ్మిశెట్టి వెంకట్ నారాయణ , చల్ల హనుమంతరావు , దుండుగులు రాంబాబు లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు బత్తుల వీరబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఉన్న మండల నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసి సంఘం బలపేతానికి కృషి చేస్తానన్నారు . అలాగే కుల సంఘ భవనం నిర్మాణానికి స్థలం మరియు నిధుల ఏర్పాటు విషయంలో తమ వంతు కృషి చేస్తానన్నారు . వడ్డెరులకు సంబంధించిన సంక్షేమ పథకాలను మన కులస్తులకు అందేలా ఎల్లవేళల కృషి చేస్తానని తెలిపారు . అదేవిధంగా అందరిని కలుపుకొని పనిచేస్తానని అన్నారు . ఈ కార్యక్రమంలో బత్తుల తిరుమలరావు , తమ్మిశెట్టి పరశురాం , డేరంగుల రాంబాబు , రామకృష్ణ , చింతలంకరణ లక్ష్మయ్య , రామనాథం , వేముల వెంకట మల్లయ్య , రామారావు , శ్రీను వెంకటేశ్వర్లు , బండారు నరేష్ , చిన్న గుంజ వీరబాబు , చల్లారని సంపంగి , వెంకటాచలం , నాగేశ్వరరావు , వీరన్న , శివ , రఘు , గణేష్ , ఆలకుంట ఏడుకొండలు , తమ్మిశెట్టి కృష్ణ , సోమరాజు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking