రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు ఎంపికైన అరవింద పబ్లిక్ స్కూల్ విద్యార్థులు

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 23:

ఇండియన్ బ్రిలియంట్స్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల యందు గత నెలలో నిర్వహించిన ప్రథమ దశ పోటీ పరీక్షల్లో నగరంలోని రంగశాయిపేటలో గల అరవింద పబ్లిక్ స్కూల్ నుండి 31 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా 8 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఆకుతోట శ్రీ చరణ్ (1వ తరగతి), కందగట్ల భావ్య (2వ తరగతి), బింగి మయూరి (3వ తరగతి), మునిబా కువ్రత్ ఉల్ ఎయిన్ సూది (3వ తరగతి), రావుల శివగణేష్ (4వ తరగతి), కోట దీపిక (4వ తరగతి) సుతారి సంకీర్తన (6వ తరగతి), సుతారి రక్షిత (6వ తరగతి). వీరు ఈ నెల 28న ఖమ్మం పట్టణంలోని ఎస్ బిఐటి కాలేజీలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాఠశాల కరస్పాండెంట్ పంచకం నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదివి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన తల్లి దండ్రులను, ఈ యొక్క పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న ఇండియన్ బ్రిలియంట్స్ ఒలంపియాడ్ డైరెక్టర్ అంతోటి రామకృష్ణ, సిబ్బందిని ఈ సందర్భంగా కరస్పాండెంట్ పంచకం నర్సయ్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking