నత్త నడకన నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు..!!
కమిషన్లు నిండుగా.. పనులన్నీ డల్లుగా
ఖమ్మం ప్రతినిధి జనవరి 8 (ప్రజాబలం)ఖమ్మం
నూతన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు నూతన భవన నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి.. భవన నిర్మాణాలు చేపట్టాలని సంకల్పం పూనుకుంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా నూతన గ్రామపంచాయతీ భవనాల పరిస్థితులు దాపరించాయి. భవన నిర్మాణంలో సైతం నాసిరక నిర్మాణాలు చేపట్టారు అంటూ గతంలో పెద్ద ఎత్తున ఆరోపణ సైతం వెల్లువెత్తాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిపై కనీసం చూసిచూడనట్టు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. లక్షల రూపాయలు వెచ్చించి ప్రజాధనంతో ప్రజలకు ఉపయోగపడే టటువంటి భవన నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. ఎక్కడికక్కడ నాసిరకం పనులు చేపట్టి భవనాలు నిర్మిస్తున్నట్టుగా ప్రజల నుండి జోరుగా చర్చలు సాగాయి. అంతంత మాత్రంగానే పనులు ముందుకు వెళ్లాయి. నూతన పంచాయతీ భవనాలలో.. అంతా డొల్ల తనం కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాలలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు శరవేగంగా జరిగిన ఈ మధ్యకాలంలో నర్తన నడకన సాగుతున్నాయి. ప్రజలకు అందుబాటులో రావలసినటువంటి నూతన గ్రామపంచాయతీ భవనాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా.. పనులన్నీ నిలిచిపోయి మా పనులు చేపట్టండి .. అంటూ గ్రామపంచాయతీ దీనంగా ఎదురుచూస్తున్నాయి లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వ గ్రామపంచాయతీ భవనాలు.. ప్రజలకు అందుబాటులో రాని పరిస్థితులు దాపరించాయి. పెద్ద మొత్తంలో నాసిరకం పనులే జరిగాయి అంటూ గతంలో జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలలో ప్రజలు ఆరోపణలు చేశారు. -ఎట్టకేలకు పనులు ముందుకు సాగిన.. గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణాలు వేగం కాక.. పనులు చేపట్టాలంటూ గ్రామపంచాయతీ భవనాలే ప్రజల వైపు ఎదురుచూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నత్తనడకన సాగుతున్న గ్రామపంచాయతీ భావన నిర్మాణ పనులు వేగంగా చేపట్టి.. ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు శరవేగంగా చేపడితే బాగుండు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల పనులు శరవేగంగా చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో ఆలస్యంగా భవన నిర్మాణ పనులు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా శరవేగంగా పనులు జరిగి త్వరగా ప్రారంభోత్సవాలు జరిగి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని స్థానిక గ్రామ ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
కమిషన్లు నిండుగా..పనులన్నీ డల్లుగా
జిల్లాలో జరుగుతున్న నూతన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణంలో కమిషన్లు దండు గానే సాగుతున్నట్టు చర్చలు జరుగుతున్నాయి. కమిషన్లు నిండుగా ఉండటం వల్లనే పనులన్నీ డల్లుగా సాగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం వీటిపై అధికారులు జర దృష్టి పెట్టిన పాపాన పోలేదు. భవన నిర్మాణ పనులంతా నాసిరకమే జరిగాయి అంటూ.. ఆరోపణలు గతం నుండి జరుగుతూనే ఉన్నాయి. అంతా నాసిరకంగా నిర్మించిన పనుల్లో మాత్రం .. వెనుకంజ జరుగుతూనే ఉన్నాయి. త్వరగా భవనాలు సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. నూతన ఎమ్మెల్యేలు సైతం గ్రాండ్ గా.. ప్రారంభం చసుకోవచ్చు. ఇకనైనా అధికారులు దృష్టి పెట్టి నూతన గ్రామపంచాయతీ భవనాలు వేగంగా నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.