ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో రైతు భరోసా,కొత్త రేషన్ కార్డుల సంబరాలు
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 06 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త రేషన్ కార్డులు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ఈరోజు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీతక్కగార్లు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోమవారం రోజున
అనంతరం మిఠాయిలు పంచి, టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూజారి తిరుపతి, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్ లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు పింగళి రమేష్ దండేపల్లి మండల అధ్యక్షుడు అక్కాల వేంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ లు ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్, సీనియర్ నాయకులు ముద్దసాని వేణు యుత్ నాయకులు ముత్తె వేంకటేష్,చుంచు నగేష్,అత్తర్ సింగ్ రాజు,బుద్దె శ్రీనివాస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు,యన్ ఎస్ యూ ఐ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.