తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో వ్యవసాయ బోరు మోటర్ల వద్ద స్టార్టర్లు కేబుల్ వైర్లు చోరీ..

30 మంది రైతుల పొలాల వద్ద రాత్రి వేళలో దొంగతనాలు..

మెదక్ 25 జూన్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట కింద ఉన్న వ్యవసాయ బోరు మోటర్ల వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు సుమారు 30 మంది రైతుల వ్యవసాయల వద్ద స్టార్టర్లు బోరు మోటర్ వైర్లు చోరీకి గురయ్యాయి. పంటలు వేసే సమయం లో స్టార్టర్లు కరెంటు వైర్లు దొంగలించడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి ప్రతి ఏడు పంట సమయం కు దొంగలు రాత్రి వేళలో వచ్చి వైర్లు కత్తిరించి స్టార్ట్ డబ్బాలు ధ్వంసం చేసి రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ దొంగలను వెంటనే గుర్తించి పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెరువు కట్ట కింద సుమారు 30 మందికి చెందిన రైతులు వెంకటేష్ యాదవ్ చంద్రయ్య, సహదేవ్ రాములు, మల్లేష్ గణేష్ లకు చెందిన దొడ్ల నవీన్ రవి పోతరాజు కృష్ణులకు చెందిన వ్యవసాయ స్టాటర్లు వైర్లను దొంగలించిన వారిని వెంటనే పట్టుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking