ఖమ్మంలో పోలీసులపై కాంగ్రెస్ కార్పొరేటర్ అమానుష దాడి
వన్ టౌన్ సీఐని నోటితో కొరికి గాయపర్చిన మిక్కిలినేని మంజుల
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం కార్పొరేషన్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన ఖమ్మం వన్ టౌన్ సీఐని మహిళ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నోటితో కొరికి గాయపర్చారు.పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండ విధులలో ఉన్న అధికారిని గాయపర్చారు కాంగ్రెస్ కార్పొరేటర్ చేసిన అమానుష దాడి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలను శాంతిభద్రతలను కాపాడే పోలీసులపైనే కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.