జాతీయ నులిపురుగుల నియంత్రణపై అవగాహన సమావేశం

 

నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 19 : ఈ‌ నెల 20 న గురువారం జరిగే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వెంకట్రావుపేట రైతువేదికలో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వేశంలో హెచ్ఈవో లక్ష్మణ్ స్వామి మాట్లాడుతూ…లక్షెట్టిపేట మండలంలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 10,216 పిల్లలను అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్స్ లో,అంగన్వాడీ సెంటర్స్ లో భోజనం అనంతరం అల్బెండొజోల్ మాత్రలను తప్పకుండా అందించాలని అన్నారు.బడికి హాజరు కాని పిల్లలకు ఈనెల 27 న మాప్ అప్ డే రోజున తిరిగి మాత్రలను అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో విజయ ప్రసాద్,హెల్త్ సూపర్ వైజర్ మార్త, హెల్త్ అసిస్టెంట్లు వేణు,గఫూర్, ఇసాక్ అహ్మద్,ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంల్ హెచ్ పీ లు, ఏఎన్ఎంలు,అంగన్వాడీ సిబ్బంది,ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking