సైబర్ క్రైమ్స్ పై అవగాహన లక్షెట్టిపేట సిఐ కృష్ణ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 20 : లక్షెట్టిపేట పట్టణంలోని వాగేశ్వర జూనియర్,డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోలీసులు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ…విద్యార్థులు ప్రస్తుతం జరుగుతున్న ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.మన ఫోన్లకు,మన తల్లితండ్రుల ఫోన్లకు ఎవరైనా కాల్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదన్నారు. ఫోన్ చేసి నేరగాళ్లు ఓటీపీ చెప్పమన్న చెప్పకూడదని ఎలాంటి బ్యాంకు పనులు ఉన్న నేరుగా బ్యాంకు కు వెళ్లి పనులు చేసుకోవాలన్నారు.అంతే కాకుండా బాంక్ అధికారులు ఫోన్ చెసి వివరాలు చెప్పని ఎట్టి పరిస్థితుల్లో అడగరని అన్నారు.మన తల్లి తండ్రులు కూడా ఆన్ లైన్ మోసలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలు కళాశాలకు వచ్చి పోయే సమయంలో అక్కతాయిలు వేధిస్తే షీ టీమ్ 100 కి కాల్ చేసి పిర్యాదు చేయాలని షీటీమ్,100 డయల్ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సిఐ వెంట ఎస్సై లక్ష్మణ్,కళాశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking