అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు విస్తరణ
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పెండింగ్ సమస్యలు పరిష్కారం
పేదలకు మరింత మెరుగైన సేవలందించాలన్నదే బాలకృష్ణ ఆలోచన
హెల్త్ టూరిజం హబ్ లో బసవతారకం ఆస్పత్రి పాత్ర సీఎం రేవంత్ రెడ్డి
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి , ఆస్పత్రి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు , మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి జూన్ 22 (ప్రజాబలం) ప్రపంచంతో పోటీ పడే విధంగా హైదరాబాద్ లో హెల్త్ టూరిజం హబ్ ను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేసే క్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలను కూడా వినియోగించు కుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం జరిగిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవం లో నామ నాగేశ్వరరావు తో కలిసి ఆయన మాట్లాడారు. అద్భుతమైన సౌకర్యాలతో ఏర్పాటు చేసే ఈ హెల్త్ టూరిజం హబ్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పాత్ర కూడా ప్రముఖంగా ఉంటుందని చెప్పారు.ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సభ్యులు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలు మరింతగా విస్తరించేందుకు కావాల్సిన 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి నందుకు సీఎం కు ప్రత్యేకించి, కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి సేవలను మరింతగా విస్తరిస్తామని సీఎం ను కోరగా సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఇందుకు సంబంధించిన భవనాల అనుమతులు కూడా త్వరగా వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం పట్ల నామ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో ఆస్పత్రి పెండింగ్ సమస్యలన్నీ పరిస్కారమయ్యాయని చెప్పారు. భవన నిర్మాణ అనుమతులన్నీ సకాలంలో ఇచ్చేలా సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, వారికి కృముఖంగా ప్రచురించడం ఆస్పత్రి స్థాయిని ప్రతిబింబిస్తుందని తెలిపారు..ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ కు ఎప్పుడూ పేదలకు మరింత మెరుగైన రీతిలో సేవలందించి, వారి ఆరోగ్యాలను కాపాడాలనే ఆలోచనే ఉంటుందని నామ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ, సీఈవో కె. కృష్ణయ్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు భరత్ తో పాటు నారా బ్రాహ్మణి, దత్తాత్రేయుడు, రాఘవరావు, దశరధరామిరెడ్డి,శివరాం ప్రసాద్ , సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.