కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 20 (ప్రజాబలం) ఖమ్మం కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వైద్య శాఖ అధికారులతో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ వ్యాపి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మే మాసం నుండి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. లక్షణాలున్న వారందరికీ కోవిడ్ పరీక్షలు చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో 2724 కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, అవసరమయితే మరిన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ నియంత్రణ డ్రగ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, మాస్క్ లు అందుబాటులో ఉంచాలని, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ వార్డు, కోవిడ్ ఓపి, ల్యాబ్ లు క్రియాశీలం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితులు ఉత్పన్నమయిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, డిసిహెచ్ఎస్ డా. బి. వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డా. బి. కిరణ్ కుమార్, ఉప జిల్లా వైద్యాధికారి డా. బి. సైదులు, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. వి. సదానందం, డా. డి. రమాదేవి, డా. సందీప్, కె. అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking