అప్రమత్తంగా ఉంటూ భద్రతా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 24 (ప్రజాబలం) ఖమ్మం కలెక్టర్ జిల్లా ప్రజాపరిషత్ ప్రాంగణంలోని ఇవిఎం గోడౌన్ ని తనిఖీ చేశారు గోడౌన్ తాళాలు, సీళ్ళు, సిసి కెమెరాలు పరిశీలించారు అనంతరం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ ని నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి ప్రతినిధులకు చేరవేయాలని, ఏవైనా తప్పులుంటే దృష్టికి తేవాలని అన్నారు. 1 అక్టోబర్ కటాఫ్ తేదీ అని, ఆ రోజుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. నమోదుకు 19 సెప్టెంబర్ వరకు అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 1439 ఉన్న పోలింగ్ కేంద్రాలు, 1455 కి పెంచడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలు తమ తమ బూత్ లెవల్ ఏజెంట్/బాధ్యుల జాబితా సమర్పించాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్/బాధ్యులతో బూత్ లెవల్ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళతారన్నారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ ఇచ్చినప్పటి నుండే స్పెషల్ సమ్మరి రివిజన్ ప్రారంభం అయిందని ఆయన తెలిపారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రదర్శించినట్లు ఆయన అన్నారు. అడ్రస్ మార్పు, చనిపోయిన, షిఫ్ట్ అయిన, డూప్లికేట్ ఓటర్ల విషయంలో సంబంధిత ఫారాల్లో దరఖాస్తు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. దర్సఖాస్తులు ఆన్లైన్ లోనే చేపట్టాలని, ఆన్లైన్ వెబ్ సైట్, యాప్ లపై కలెక్టర్ అవగాహన కల్పించారు. శని, ఆదివారాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు, ఆ రోజుల్లో బూత్ లెవల్ అధికారులు, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, ఓటరుగా పేరు ఉందొ లేదో చూసుకోవడం, లేకుంటే వెంటనే నమోదు చేసుకోవడం, సమస్యలు ఉంటే దృష్టికి తేవడం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జెడ్పి సిఇఓ అప్పారావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి నల్లమోతు తిరుమల రావు, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్,  సిపిఐ(యం) పార్టీ ప్రతినిధి పొన్నం వెంకటేశ్వర రావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నల్లమల సత్యంబాబు, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి లింగబోయిన సతీష్, టిడిపి పార్టీ ప్రతినిది కె. కరుణాకర్,  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking