13 రకాల యూనిట్ల ద్వారా మహిళలకు మంచి ఆర్ధికభివృది.

మహిళలకు పరిశ్రమిక వేత్తలుగా తయారు చేయడము ప్రభుత్వ లక్ష్యం.

లబ్దిదారులకు అందాల్సినా యూనిట్లు గ్రేడింగ్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన

…..జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి జులై 5 ప్రజ బలం ప్రతినిది: మహిళా శక్తి లబ్దిదారులకు అందాల్సినా యూనిట్లు గ్రేడింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు .
శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ మిని సమావేశమందిరంలో జరిగిన గ్రామీణ మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


మహిళలు అన్ని రంగాలు ముందుండాలని మహిళా సాధికారత ఈ ప్రభుత్వ లక్ష్యమని మహిళలకు పరిశ్రమిక వేత్తలుగా తయారు చేయడానికి మహిళా క్యాంటిన్ ఏర్పాటుచేసి జిల్లాలోని ఆయా బ్యాంకుల శ్రీనిధి ద్వారా మహిళా శక్తి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా నిర్వహించాలని అన్నారు , జిల్లాకు మంచి పేరు తేవాలని అలాగే వివిధ రకాలైన ఈవెంట్ మేనేజ్మెంట్, మైక్రో ఎంటర్ప్రైజెస్, వ్యవసాయ పనిముట్ల, పాడిపరిశ్రమ ,కోళ్ల పెంపకం , మహిళా క్యాంటీన్ తదితర 13 రకాల యూనిట్ల ద్వారా మహిళలకు మంచి ఆర్ధిక పురాణభివృది సాధిస్తారని ఆమె తెలిపారు . అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బడుగు చంద్ర శేఖర్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృది మహిళా సంఘాలు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో సబ్సిడీ పథకాలు విరివిగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. సంబంధించిన అధికారులు నెల వారిగా టార్గెట్ పూర్తి చేయాలని అందుకోసం బ్యాంకర్లు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ,ఇందుకోసం జిల్లా ఎల్. డి.యం ప్రతేక చొరువ తీసుకోవాలని ఆయన సూచించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృది అధికారిణి యం. జ్యోతి,అదనపు డి.ఆర్.డి.ఓ జంగారెడ్డి డి.పి.యం లు ఎ.పి.యం.లు ఇతర జిల్లా అధికారులు ,జిల్లా సమైక్య ,మండల సమైక్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking