ఖమ్మం నగరంలో నూతన శ్రీ దర్శన హాస్పిటల్ ను ప్రారంభించిన
డిప్యూటి సీఎం సతీమణి మల్లు నందిని
పూజా కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి వారి మన్ననలు పొందాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ మల్లు నందిని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం డిసిసిబి చైర్మెన్ కూరాకుల నాగభూషణం అన్నారు శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని మయూరి సెంటర్ వద్ద గల నూతన శ్రీ దర్శన హాస్పిటల్ ను వారు ప్రారంభించి మాట్లాడారు అనుభవం ఉన్న డాక్టర్ రాకేష్..నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించివారి మన్ననలు పొందాలని వారుసూచించారుఅనంతరం శ్రీదర్శన హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే బి పి ఎల్ కేటగిరిలో ఉన్నవారికి రాయితీ విధానంలో కూడా వైద్యసేవలను అందిస్తూ అన్ని జిల్లాల ప్రజల మన్ననలు పొందేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు డాక్టర్ రాకేష్ ఉషశ్రీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు సాదురమేష్ రెడ్డి జలగం రామకృష్ణ బిఆర్ఎస్ పార్టీ ముస్లింమైనార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనకమెడల సత్యనారాయణ శ్రీదర్శన హాస్పిటల్ యాజమాన్యం గౌని రాంపండు గౌని వెంకటరమణ చింతలచెరువు వీరస్వామి యాదవ్ లక్ష్మీ యాదవ్ ఖమ్మం నగర బీసీ సెల్ నాయకులు తోడేటి లింగరాజు యాదవ్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు