బిజెపివి అన్ని అప్రజాస్వామిక విధానాలే

 

146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం దారుణం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

ఇండియా కూటమి సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం బిజెపి అవలంబిస్తున్న విధానాలు అన్ని అప్రజాస్వామిక విధానాలే, ప్రజాస్వామిక మనుగడకు మోడీని గద్దె దింపాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను ఆప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి సభ్యులతో కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లజెండాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ…పార్లమెంటుపై అగంతకులు చేసిన దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను ఆ ప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలని అన్నారు ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంటుపై జరిగిన దాడిపై ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం ఇండియా కూటమి సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంత రావు మాట్లాడుతూ ఇండియా కూటమి మోదీ అప్రజాస్వామిక విధానాలపై పోరాడుతుందని అన్నారు ఇదిప్రజాస్వామ్యం కోసం పోరాటం అన్నారు.సిపియం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంటు లో146 మంది పార్లమెంటు సభ్యులును సస్పెండ్ చేయడం దారుణమన్నారు.ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు మాట్లాడుతూ మోదీ హిట్లర్ కంటే దారుణమైన పాసిస్టు విదానాలు అనుసరిస్తున్నారని ఇండియా కూటమి ఐక్యంగా నిలిచి మోదీతో పాటు ఆయన విదానాలు ఓడించాలని అన్నారు.సిపిఐ యంల్ (ప్రజాపందా) జిల్లా నాయకులు గొకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అంటే మోదీని ఓడించాలని అన్నారు.మాజీయంయల్సీ పొట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా INTUC అద్యక్షులు కొత్తా సీతారాములు,జిల్లా కిసాన్, మైనారిటీ,SC సెల్, సేవాదళ్ ,అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బొడ్డు బొందయ్య, SD గౌస్,కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల, భారతి చంద్రం,చావా నారాయణ, రావూరి సైదుబాబు, మందడపు మనోహర్ , దొడ్డా నగేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కూల్ హోమ్ ప్రసాద్, రషీద్,మిక్కిలినేని నరేందర్ , బాణాల లక్ష్మణ్, , నరాల నరేష్,రజి, సిపిఎం నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, శ్రీకాంత్,మీరా , సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, ప్రజాపందా నాయకులు ఆవుల అశోక్, మంగతాయారు,ఆప్ నాయకులు స్వర్ణ సుబ్బారావు గంధం పుల్లయ్య పసుమర్తి శ్రీనివాస్ గడ్డం వెంకటయ్య, నుకారపు వేంకటేశ్వర్లు మహమూద్ వాసిం ముజాహిద్దీన్ గద్దికొప్పుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking