బిజెపి ఓబిసి విభాగం రాష్ట్ర కమిటీ లో రాజు నేత కు చోటు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 24:
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబిసి విభాగం నూతనంగా ప్రకటించిన రాష్ట్ర కమిటీ లో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎనుగంటి రాజు నేత కి చోటు దక్కింది. ఓ బి సి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజు నేతను నియమించినందుకు పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు నేత మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో మరియు భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ విభాగంలో ఏ బాధ్యత అప్పజెప్పిన పూర్తిస్థాయిలో నిర్వహించిన సందర్భంగా పార్టీ మళ్లీ నామీద నమ్మకంతో రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది అని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలోని 56 శాతానికి పైగా ఉన్న బీసీల సమస్యల మీద గొంతెత్తుతానని తెలిపారు. దేశ ప్రధానిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి మళ్లీ ప్రధానిగా రావడం కోసం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా నిరంతరం కష్టపడుతామని, దేశంలో గత 75 సంవత్సరాల కాలంలో బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాలకు సరైన విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం పోరాటం చేస్తామని, బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అవకాశాలు వచ్చినప్పుడే ఆ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో పదవి బాధ్యతలు అప్పగించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking