గిరిజన విశ్వవిద్యాలయ స్థలం చుట్టూ సరిహద్దు స్థంభాలు ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 22 :

 

గిరిజన విశ్వవిద్యాలయ స్థలం చుట్టూ సరిహద్దు స్థంభాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ములుగు జిల్లా కేంద్రం లోని గట్టమ్మ దేవాలయం ఎదురు గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ కోసం మొత్తం 337 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందని, సంబంధిత స్థలాన్ని రెవెన్యూ అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు బదలాయింపు చేయడం జరిగిందని అన్నారు.
ఈ సంవత్సరం యూనివర్సిటీ ఏర్పాటులో భాగంగా తాత్కాలిక తరగతుల నిర్వహణ ములుగు మండలం లోని ట్రైబల్ యూత్ ట్రైనింగ్ సెంటర్ జకారం లో తరగతులు ప్రారంభం ఔతున్నాయని తెలిపారు. 337 ఎకరాల స్థలాన్ని ఎవరు అక్రమించకుండా చుట్టూ సరిహద్దు స్థంభాలు ఏర్పాటు చేయాలని స్థలాన్ని ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, ఆర్డీఓ కే. సత్యా పాల్ రెడ్డి, తహసిల్దార్ విజయ భాస్కర్, ఆర్ ఐ విజేందర్, సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking