అవిశ్వాసం పెట్టింది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్

 

జమ్మికుంట ప్రజాబలం జనవరి 27

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టింది సొంత పార్టీకి చెందిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్ లేరని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. నాకు ఓటు వేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం అని ప్రజలను సెంటిమెంటుతో భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలకు ఏమి చెప్పి గెలిచారో మర్చిపోయారని తీరా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పై బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్స్ అతనిపై అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి అవిశ్వాసం పెట్టిందనడం కౌశిక్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కొన్న చరిత్ర బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే సంస్కృతి బి ఆర్ ఎస్ పార్టీకే ఉందని తమ పార్టీ ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిందని ఏప్పటికీ ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో వాటిని ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ .జమ్మికుంట టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రం సతీష్ రెడ్డి. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎంగిలే రామారావు వీణవంక మండల ప్రెసిడెంట్ సాయెబ్ హుస్సేన్ రైతు సంఘం అధ్యక్షులు జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు సూర్య.యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ సజ్జు. జమ్మికుంట మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు రాచపల్లి రమేష్ .ఎండి సలీం, మండ అశోక్ గౌడ్, మధుకర్ రెడ్డి.వినోద్ రెడ్డి.చిలువేరి రాజమౌళి.పాతకాల అనిల్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking