గొల్డెన్ టెంపుల్ కూడలిలో వ్యాపార లావాదేవీలకూ కట్టడి.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 జూన్ 2024:
గొల్డెన్ టెంపుల్ కూడలి మణికొండ కౌన్సిల్ ప్రాంతంలోనే అతి రద్దీ గల ప్రాంతంగా జగమెరిగిన సత్యం, ఆ కూడలి ద్వారా సెక్రటేరియట్ కాలనీ, తిరుమల హిల్స్, బయూత్ కాలనీ, వై.యస్.ఆర్ కాలనీ, పాషా కాలనీ, ఖిజ్రా కాలనీ, డైమండ్ హిల్స్, వేంకటేశ్వర కాలనీ, పయోనేర్ కాలనీల పురజన వాసులందరు వెళ్లవలసినదే, అట్టి ప్రముఖ కూడలిలో రహదారి బాటసారులు కానీ, ద్విచక్ర వాహన చోదకులు, కార్ వాహనాలపై బుదవారం రోజున కూడలి దాటాలంటే నరకయాతన అనుభవించ వలసిందే, పరిస్థితిలను మార్చడానికి గాను వీ.ఆర్.4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా గతంలో చాలా సార్లు పిర్యాదు చేయడం జరిగినదని, మరియొక పర్యాయం జూన్ 12 న మున్సిపల్ కమిషనర్ కు అర్జీ పెట్టడం, అందుకు స్పందించి ట్రాఫిక్ కంట్రోల్ వారి సహాయంతో సమస్య తీర్చడానికి సాయ శక్తుల ప్రయత్నిస్తామని చెప్పడం జరిగినదని ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ, యాదార్తానికి గత బుదవారం 19న యధా ప్రకారం జన వాహిని ఇబ్బందుల పాలు కావలసి వచ్చిందనీ, తై బజార్ పన్ను వసూలుకు కొత్తగా రాబోయే వ్యక్తితో మున్ముందుగా మాట్లాడీ అతన్ని ఆమోదింప జేసి కూడలికి 15 మీటర్ల చుట్టూ వరకు ప్రజా సౌకర్యార్థం ఎట్టి వ్యాపార లావాదేవీల సముదాయంలు ఉండకుండా చూడాలని, ప్రజలకు మేలు చేయాలని పత్రికా ముఖంగా కమిషనర్ ను, పాలక వర్గాన్ని కోరుతు అందె లక్ష్మణ్ రావు యొక్క వినమ్ర పూర్వక వినతి.

Leave A Reply

Your email address will not be published.

Breaking