తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా వీ.ఆర్4 సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ చే మజ్జిగ పంపిణి.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02జూన్ 2024:
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి మన తెలంగాణరా ! అట్టి తల్లి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజైన జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో గులాభిదల సైనికులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని కన్నుల పండుగగా హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడంతో పాటు జరిగిన అవతరణ దినోత్సవ ఉత్సవాలు మణికొండలో బీ.ఆర్.ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణా రెడ్డి, మణికొండ కౌన్సిల్ ఏరియా అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు ఆద్వర్యంలో ఆర్.కే సర్కిల్ వద్ద జండా పండుగ జరుప బడినదని అందులో స్థానిక కౌన్సిలర్ లు వసంత్ రావ్ చౌహాన్, ఆలస్యం నవీన్ కుమార్, కావ్య శ్రీరాములు, శైలజా వినోద్ లతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు మరియు ఈ ఉత్సవాల శుభ సందర్భంగా వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ వారు విచ్చేసిన అథిదులకు, రహదారి బాటసారులకు చల్లటి చిక్కటి మజ్జిగను స్వయంగా పంపిణి చేయడం జరిగినదనీ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking