ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 02 : మంచిర్యాల జిల్లాలోనిచైన్ స్నాచ్యింగ్ కి పాల్పడిన దోపిడీ దొంగలు అరెస్ట్ 1 గంటలోనే ఛేదించిన సిసిసి నస్పూర్ పోలీసులు తేదీ: 30.06.2024 నాడు సాయంత్రం జగదాంబ కాలనీ కి చెందిన మురికి భాగ్యలక్మీ కూరగాయలు కొని ఇంటికి తిరిగి వస్తుండగా జగదాంబ కాలనీలో రోడ్ లో ఆమె మెడలో నుండి సుమారు 49.5 గ్రాముల పుస్తెల తాడు ని తెంపుకొని పోగా,దీని మీద కేసు నమోదు చేసి, మంచిర్యాల రూరల్ సి.ఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో 3 టీంలని ఏర్పాటు చేసి సిసి కెమెరాల ఆధారంగా విచారణ చేయగా కేవలం గంట వ్యవధిలోనే వారు వాడిన బైక్ ని,నిందితులు ఇద్దరు ఆర్ కే-8 కాలనీ కి రాజేందర్,దుర్గం.స్వామి గా గుర్తించడం జరిగింది. నిందితులు పథకం ప్రకారం భాగ్యలక్మీ ని బైక్ మీద వెంబడించి ఆమె కాలనీ లో కి వచ్చే ముందే రాజేందర్ వెనకాల వెళ్లి ఆమె ని చంపుతానని బెదిరించి ఆమె మెడలో నుండి పుస్తెల తాడు ని తెంపుకొని ఆమె ని కింద పడవేసి,ముందే బైక్ మీద స్వామి సిద్ధంగా ఉండగా ఇద్దరు కలసి బైక్ మీద పారిపోయనారు.నిందితులు ఇద్దరిని సోమవారం రోజు స్వామి వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుండి 49.5 గ్రాముల బంగారు పుస్తెల తాడు టి ఎస్ 19జె4084 టివిఎస్ రైడర్ బైక్ ని స్వాధీనం చేసుకొని నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది.గంట వ్యవధిలోనే కేసు ని డిటెక్ట్ చేసి సొమ్ము ని రికవరీ చేసి నిందితులని అరెస్ట్ చేసిన సి.ఐ అశోక్,ఏ ఎస్సై రవికుమార్,ఏ ఎస్సై ఇజాజ్,సతీష్,నరేందర్, సిసిఏస్ సిబ్బంది సత్తయ్య, సతీష్ లని మంచిర్యాల ఏసిపి ప్రకాష్ అభినందిచారు.కేవలం సిసి కెమెరాల ఆధారంగానే కేసు ని డిటెక్ట్ చేయడం జరిగిందని కావున నేరాల నివారణలో కెమెరాల ప్రాధాన్యతని వివరించారు.ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటులో భాగస్వాములు కావాలని
మంచిర్యాల ఏసీపి కోరారు.