ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

 

కాంగ్రెస్ ద్వారానే విద్యా,ఉపాధి అవకాశాలు

డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 19 : కాంగ్రెస్ ద్వారానే దేశంలో విద్యా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయాని డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని విశ్రాంతి భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…2004,2009 రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు.దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా దేశ వ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు “భారత్ జోడో యాత్ర” పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే నన్నారు.భారత దేశ ప్రజలను ఏకం చేయడం వారి సమస్యలను వినడం లక్ష్యంగా పెట్టుకొని యాత్రను విజయవంతం చేసుకుని, కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,యువ కిశోరుడు,రాహుల్ గాంధీ మాత్రమే అని అన్నారు. ఈ దేశంలోని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం,రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చెర్మెన్ ఎండీ అరిఫ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవికుమార్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు గుత్తికొండ శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు చాతరాజు రాజేష్,శివ,లింగంపల్లి సుధాకర్,మడిపెళ్ళి స్వామి, నడిమెట్ల రాజన్న,అమీర్, హాజీ,బొప్పూ సతీష్,సూరం చంద్రమౌళి,మాడిశెట్టి శ్రీకర్, రాజేష్, రాకెష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking