ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులకు కొన్ని నిబంధనలు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

ప్రల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు ఆధార్ కార్డ్,కానీ ఓటర్ ఐ. డి.కార్డు కానీ,రేషన్ కార్డు కానీ,బ్యాంక్ పాస్ బుక్ కానీ రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఏదయినా ఒరిజినల్ ఉంటేనే ఉచిత ప్రయాణమని,ఇవి ఫోన్ లో ఫొటో లు జిరాక్స్ కాపీలు ఉంటే ఉచిత ప్రయాణం చెల్లదని,ఛార్జి తో కూడుకున్న టికెట్ తీసుకొని కండక్టర్ కు సహకరించాలని ఆమె పేర్కొన్నారు.
అలాగే మహిళా ప్రయాణికులు ఎక్స్ ప్రెస్ బస్సులో ఎక్కి ఎక్స్ ప్రెస్ బస్ కు స్టేజ్ లేని చోట బస్సు ఆపుమని డ్రైవర్ కoడక్టర్లను ఇబ్బంది పెడుతున్నారు. అలా స్టేజి లేని చోట బస్సు ఆపడం కుదరదు.ఎందుకంటే ఎక్స్ ప్రెస్ బస్ లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది అవుచున్నది.అలాంటప్పుడు మీరు తక్కువ దూరం ప్రయనించేది ఉంటే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించాలని డ్రైవర్,కండక్టర్ లకు సహకరించి తోటి ప్రయాణికుల కు ఇబ్బంది కలుగకుండా చూడాలని డిపోమేనేజర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking