కోరం కనకయ్య చేసిన అభివృద్ధిని చూసి గెలిపించండి

పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం పొంగులేటి శీనన్న అండతో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేయుచున్న కోరం కనకయ్య గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ బెడ్ రూమ్ లు, రోడ్ల వెడల్పు కార్యక్రమం, ప్రతి వీధికి బోరు నీటి సౌకర్యం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన భూ కబ్జాలు దందాలు సెటిల్మెంట్లు , అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలు లో పెట్టడం తప్ప ఒరగ పెట్టింది ఏమి లేదని, ఏనాడు కక్షపూరిత రాజకీయం చేయని కోరం కనకయ్య చేసిన అభివృద్ధిని చూసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు ఇల్లందులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న మంత్రి అండతో అభివృద్ధి చేయించుకోవడం చేతగాక కక్షపూరిత రాజకీయ వాతావరణాన్ని సృష్టించి, ఒకే తెగలోని కులాన్ని రెచ్చగొట్టడం, గిరిజనేతర్లకు, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ఎదుగుదల లేకుండా చేయడం కోసం అసెంబ్లీ లోనే మాట్లాడారని, ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించుకుంటే ప్రశాంతంగా ఉన్న ఇల్లందు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనివిధంగా కక్షపూరిత వాతావరణంతో శాంతి భద్రతల సమస్య పెరిగే అవకాశం ఉందని, కావున ఇల్లందు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని, కోరం కనకయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మల్లి బాబు యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కంబాల ముసలయ్య ధనియాకుల రామారావు బండారు రాములు, బండారు నాగేశ్వరరావు, బుర్ర వీర స్వామి సంగం బిక్షపతి, గీసా రోషన్ దగ్గుల లింగయ్య, నూకల దేవేందర్ మంచా రమేష్, పవన్ గైగొళ్ల శ్రీను మంచ వినయ్, దాసరి కోటయ్య కోడి పాపయ్య రాజాలు, బుర్ర లక్ష్మయ్య గడ్డం రవి ఆవుదొడ్డి కొమరయ్య, గొర్రెల సంఘాల అధ్యక్షులు సభ్యులు, అఖిలభారత యాదవ మహాసభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking