రాజ్యాంగ ధర్మానాసనానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
ఆర్డినెన్స్‌ తెచ్చైనా ముందుగా తెలంగాణలోనే వర్గీకరణ అమలుచేస్తాం
రాజ్యాంగ ధర్మానాసనానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వాగతించారు. తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో గురువారం శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని, అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకోస్తామని సీఎం తెలిపారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై 2023 డిసెంబర్‌ 23న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ , అడ్వొకేట్‌ జనరల్‌ ఢల్లీికి వెళ్లి, సుప్రీంకోర్టులో ఈ కేసు విజయవంతం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking