సంక్షేమ పథకాల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్

 

హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వనమహోత్సవం, మహిళ శక్తి క్యాంటీన్స్, ప్రజా పాలన సేవా కేంద్రాలు, అమ్మ ఆదర్శ. వ్యవసాయం , హెల్త్, ధరణి , ఉద్యోగుల బదిలీలు, తదితర అంశాలపై రాష్ట్రం లోని అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు,

మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ గౌతమ్,అదనపు కలెక్టర్లు విజేందర్ రెడ్డి తో
కలిసి పాల్గొన్నారు,
క్షేత్రస్థాయిలో వన మహోత్సవం, ప్లాంటేషన్ మహిళా శక్తి క్యాంటీన్, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ధరణి, పారదర్శకంగా బదిలీలు, తదితర అంశాలపై తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు,

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ సంబంధిత అధికారులకు వారి వారి సంబంధించిన అంశాలలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు,

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ ఓ హరిప్రియ, డిఆర్ డి ఎ సాంబశివరావు,డీపీఓ వెంకయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రఘునాథ స్వామి,సంబధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking