స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించిన బాల్యమిత్రులు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 11

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గా కాలనీలో నివాసం ఉంటున్న తిప్పిరెడ్డి సురేష్ అనే యువకుడు నాలుగు రోజుల క్రితం అనారోగ్య కారణంగా మరణించాడు. సురేష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న బాల్యమిత్రులు తన స్నేహితుని కుటుంబానికి తమ వంతు ఏమైనా సహాయం చేయాలి అని అనుకున్నారు. స్నేహమంటే బ్రతికుండగా చటపటలేసుకొని తినడం కాదు స్నేహితులు మరణించిన తర్వాత కూడా తన కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్న బాల్యమిత్రులు తమ తో పాటు చదువుకున్న మిత్రులందరికీ కలుపుకొని మృతి చెందిన సురేష్ కుటుంబ సభ్యులకు 20 వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా తమ పిల్లల చదువుల విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నారని వారికి ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మిత్రులు. ఆకుల తిరుపతి కోడూరు రాజేష్ రవి కృష్ణ రచ్చ భాష మీద భాస్కర్ కలకోటి కపిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking