వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి

– టీడబ్ల్యూజేఎఫ్ హుజరాబాద్ నియోజకవర్గ కమిటీ
జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి, జూన్ 27:

హుజరాబాద్ నియోజకవర్గం లోని వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్ట్ పిల్లలందరికీ ఫీజులో 100% రాయితీ కల్పించాలని నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ అన్నారు. జమ్మికుంట, ఇల్లందకుంట, మండల విద్యాధికారి కార్యాలయంలో డివోఓ జారీ చేసిన కాపీని ఎంఈఓ ఆఫీస్ లో అందజేశారు. ఈ సందర్భంగా యోహన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వగా జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు 100% మానవతా దృక్పథంతో ఫీజు రాయితీ కల్పించాలని డి ఈ ఓ సర్కులర్ జారీ చేశారు.
ప్రైవేటు విద్యాసంస్థలు చదువుతున్న జర్నలిస్టు పిల్లలను మానవతా దృక్పథంతో ఫీజు తీసుకోకుండా విద్యానందించాలని జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటు వివిధ డివిజన్లో మండల కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల విషయంపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పలు మండలాల ఎంఈఓ లకు ఆర్డర్ కాపీలను అందజేశారు. ఎటువంటి జీతభత్యాలు లేకుండా సమాజంలోని సమస్యలను అనునిత్యం ప్రభుత్వం చేరవేసే క్రమంలో జర్నలిస్టు ముందుంటారని, సమాజంలోని సమస్యలను అనునిత్యం ప్రభుత్వం చేరవేసే క్రమంలో జర్నలిస్టు ముందుంటారని, జర్నలిస్టులో పిల్లలపై సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాధికారి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు సౌడమల్ల యోహాన్ తో పాటు ఉపాధ్యక్షుడు ఏబుషి సంపత్ సహాయ కార్యదర్శి ఖాజా ఖాన్, దొడ్డ రాజేంద్రప్రసాద్, రవికృష్ణ రచ్చ, పెద్ది సంతోష్ పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking