ఖమ్మం ప్రతినిధి మే 23 (ప్రజాబలం) ఖమ్మం సిఎంఆర్ రైస్ దిగుమతి లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం లోని అరుణాచల శివ రైస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. మిల్లు సామర్థ్యం, రోజుకు ఎంత మేర ధాన్యం పట్టేది, ఎంత ధాన్యం నిల్వలు ఉన్నవి, హమాలీలు ఎంత మంది వుంది అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ లో సిఎంఆర్ క్రింద 112 ఏసికే ల రైస్ ఇవ్వాలివుండగా, ఇప్పటికి 22 ఏసికే లు అందించారని అధికారులు కలెక్టర్ కి వివరించారు. జూన్ మాసాంతానికి లక్ష్యం మేర పూర్తిగా సిఎంఆర్ రైస్ అందించాలని, రోజుకు 6 ఎసికే లు అందించాలని కలెక్టర్ మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు. సిఎంఆర్ రైస్ లక్ష్యం పూర్తయ్యే వరకు ప్రైవేటు మార్కెట్ కి ఒక్క క్వింటా ఇవ్వకూడదని ఆయన అన్నారు. సామర్థ్యం మేర పూర్తిగా మిల్లు నడిపంచాలని, సరిపోను హమాలీలు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన అన్నారు. లక్ష్యం మేరకు సిఎంఆర్ రైస్ అందించకుంటే నిబంధనల మేరకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, నేలకొండపల్లి తహసీల్దార్ గౌరీశంకర్, రైస్ మిల్ మేనేజింగ్ పాట్నర్ సంతోష్, అధికారులు తదితరులు ఉన్నారు.