కస్తూరిబా పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా.

పదవ తరగతి విద్యార్థులు శత శాతం ఫలితాలు సాధించాలి.
కలెక్టర్ రాజర్షి షా.

మెదక్ జనవరి 3 ప్రాజబలం న్యూస్ :-

పదవ తరగతి విద్యార్థులు శత శాతం ఫలితాలు సాధించాలి.
కస్తూర్బా పాఠశాలలో ఏప్రిల్ మొదటి వారం వరకు మౌలిక వసతులు మెరుగుపరచాలి.

మెదక్ జిల్లాలోని టేక్మాల్, అల్లాదుర్గం మండలాల లోని కస్తూరిబా బాలికల పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం పరిశీలించారు
ఈ సందర్భంగా ఆయా పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఆయా పాఠశాలలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో కావలసిన మౌలిక వసతులను ఏప్రిల్ నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని టి ఎస్ ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం అల్లాదుర్గం కేజీబీవీ లో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు లో ఆయన పాల్గొన్నారు.
మహిళలకు విద్య కోసం మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతి కోసం అట్టడుగు వర్గాల కు చెందిన ప్రజలకు చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారని , ఆడపిల్లలకు చదువు చెప్పించడం వల్ల సమాజంలో మార్పు తీసుకురావచ్చని, ఆ కాలంలోనే మహిళా లను తన బోధనల ద్వారా విద్యావంతులను చేసిన ఘనత సావిత్రిబాయి పూలేకు దక్కుతుందన్నారు.

ఈ సందర్భంగా అల్లాదుర్గం కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులతో కలిసి సహబంతి భోజనం చేశారు. పదవ తరగతి పరీక్షల్లో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు శత శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులు ప్రత్యేక ప్రణాళికతో చదువుకునేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర గా ఉన్నాయని విద్యార్థులు, , అధ్యాపకులు సమిష్టిగా కృషితో మంచి పలితలకోసం ప్రయత్నం చేయాలన్నారు. రానున్న విద్యా సంవత్సరం వరకు కస్తూరిబా పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్,
డి పి ఓ సాయిబాబా , కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు , సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking