ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ జరపాలి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 21 (ప్రజాబలం) ఖమ్మం బాధితుల ఫిర్యాదులను విచారణ జరిపి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమస్యను చట్టపరిధిలో పరిష్కారించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రివేన్స్ డే కార్యక్రమంలో గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు , భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదలపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking