ప్రజా పాలన దరఖాస్తుల వివరాలను పూర్తి స్థాయిలో ఆన్ లైన్ లో నమోదు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 8:
సోమవారం నాడు, హైదరాబాద్ డా.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో ప్రజా పాలన దరఖాస్తులు కంప్యూటరీకరణ, కష్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) వానాకాలం , యాసంగి,పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహన్,లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు,
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, నాన్ జి హెచ్ ఎం సి పరిధిలో 2,29,000 దరఖాస్తులు వచ్చాయని సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. ప్రతిరోజు 40,000 అప్లికేషన్లు ఆన్లైన్ డేటా అప్లోడ్ అవుతున్నాయని ఈనెల 6వ తేదీ నుండి దరఖాస్తుల వివరాలను డాటా ఎంట్రీ ఆపరేటర్ల సమన్వయంతో ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని, ఈనెల 16వ తేదీలోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారుల పర్యవేక్షణలో వివరాలు నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వార్డుల వారిగా దరఖాస్తు సంఖ్య, కులం, పుట్టిన తేదీ ఆధార్కార్డు, రేషన్కార్డు, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా ఇతర వివరాలతో కూడిన ఆన్లైన్ ఫారంను ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తుఫారములో ఉన్న ప్రకారంగానే నమోదు చేసే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని రైస్ మిల్లర్లకు నిర్దేశించిన సి ఎం ఆర్ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రజా పాలన కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో విజయవంతంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి ప్రశంసించారని సీ.ఎస్ తెలుపుతూ, కలెక్టర్లను అభినందించారు.
ఈ కార్యక్రమంలోజిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు, రెవెన్యూ ) విజయేందర్ రెడ్డి, అభిషేక్ అగస్త్య,జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking