మథుర/ఉత్తరప్రదేశ్,సెప్టెంబర్ 30: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) 77వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ముగిసాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర
(బృందావన్)లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు సోమవారం ముగిసాయి. చివరి రోజు మొదటి సెషన్స్ లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధారాసింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండవ సెషన్ లో హిమాచలప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు కే. విక్రమ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్ డబ్ల్యూ జే ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల అనుబంధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్ నాయకులు పాల్గొని దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సమావేశాలలో ఐఎఫ్ డబ్ల్యూజే సెక్రటరీ జనరల్ విపిన్ దులియా, కాన్ఫడరేషన్ అధ్యక్షుడు ఇందుకాంత్ దీక్షిత్, ప్రధాన కార్యదర్శి బలరాం యాదవ్, కార్యదర్శి పులిపలుపుల ఆనందం, మహిళా కార్యదర్శి శాంతకుమారి, నమ్రత భోరా, ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతినిధి వర్గం గవర్నర్ కు, మంత్రికి శాలువ కప్పి టీడబ్ల్యూజే ఎఫ్ మెమొంటోను బహుకరించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్, కార్యదర్శులు కర్రా అనిల్ రెడ్డి, వివేకానంద,రాజశేఖర్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు కంతేటి రమాదేవి, దయాకర్, మాజీ సభ్యులు కుడితాడు బాపురావు తదితరులు పాల్గొన్నారు.