మెదక్ ఖిల్లాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

 

ఇక పద్మకు ఇంటిబాట తప్పదు

నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ..

కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు

పెయింటింగ్ అసోసియేషన్ నుంచి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక

మెదక్ ప్రాజబలం న్యూస్ :-

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి మెదక్ ఖిలాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు కోరారు. మంగళవారం మెదక్ మండల అధ్యక్షుడు శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాచవరం లోని ఓ గార్డెలో పెయింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. రోహిత్ ను గెలిపించుకుంటామని బీఆర్ఎస్ బీజేపీల అభ్యర్థులను నమ్మబోమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రావు మాట్లాడుతూ… పదేళ్లుగా పద్మ అబద్ధపు మాటలు చెప్పారని.. మెదక్ కు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని మండిపడ్డారు. ఆ రోజు చెప్పిన మోసపు మాటలు మళ్ళీ చెబుతున్నారన్నారు. మెదక్ వెనుక బాటుకు కారణమైన పద్మకు ఇంటిబాట తప్పదన్నారు. ప్రజాప్రతినిధులను పట్టించుకోరని, వెంట ఉన్న నాయకులకే ప్రాధాన్యం ఇస్తుందని, నియోజకవర్గం మొత్తం ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తారన్నారు. తనకు బలం, బలగం పార్టీ కార్యకర్తలు అని చెప్పారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత శ్రీనివాస్ చౌదరి, ప్రశాంత్ రెడ్డి, మంగ మోహన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హఫీజ్ మోల్సాబ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking