మంత్రి తుమ్మలను సత్కరించిన కాంగ్రెస్‌ నాయకులు పొదిల

ఖమ్మం ప్రజాబలం ప్రతినిధి:వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా నాయకులు పొదిల రవికుమార్‌ శాలువాతో సత్కరించారు.మంత్రి నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం నగరంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్‌ సమీపాన ఉన్న రవికుమార్‌ నివాసాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మలను పొదిల శాలువాతో సత్కరించారు.రవికుమార్‌,ఆయన తండ్రి దేవేందర్‌, కుమారుడు రాజేష్‌ లతో మంత్రి నాగేశ్వరరావు కొద్దిసేపు ముచ్చటించారు,వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల వెంట కాంగ్రెస్‌ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌,సాధు రమేష్‌ రెడ్డి, మహ్మద్‌ జావీద్‌, రాధాకిశోర్‌,వడ్డెబోయిన నర్సింహారావు, శెట్టి రంగారావు, కొత్త సీతారాములు, తాళ్లూరి హన్మంతరావు, కల్లూరి సోమనాథం, సముద్రాల శ్రీనివాసరావు, నల్లమల వేణు,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking