ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా ఎంపీలపై సస్పెన్షన్ *ఎత్తివేయాలని డిమాండ్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..డిసెంబర్ 13
పార్లమెంటులో భద్రత ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ.దేశ చరిత్రలో 143 మంది పార్లమెంటు సభ్యులను గతంలో ఎప్పుడు లేని విధంగా సస్పెండ్ చేయడం సిగ్గుచేటని మoడిపడ్డారు. పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసిన విధానాన్ని ఖండిస్తున్నామని, దేశంలో ఎమర్జెన్సీ విధించినట్లు తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును సొంత పార్టీ ఆఫీస్ గా వాడుకుంటూ బిల్లులు, చట్టాల పై చర్చ లేకుండా ఏకపక్షంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదని అన్నారు. పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగా లేదన్నారు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లు పాస్ చేసుకోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking