కాంగ్రెస్ పార్టీ 139 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139 ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు.ఈ సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి గౌరవ వందనం వేశారు.అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ,బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పూదరి తిరుపతి ,పట్టణ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు.కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో ప్రజాస్వామ్యము పరిణవిల్లుతుందని అన్నారు.మంచిరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,సురేఖల నాయకత్వంలో పార్టీ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు.వారి కృషి మేరకే కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసిందని కొనియాడారు.కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కంకన బద్ధులు కావాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking