కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

వరి దొడ్డు రకానికి కూడా 500 రూపాయలు బోనస్ చెల్లించాలి.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది.వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించి నేడు అది సన్నపు వడ్లకు మాత్రమే అని ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ నిర్మల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.ఇప్పటికే సన్న రకం వడ్లకు వర్షాకాలం సీజన్లో క్వింటాలకు 3600 రూపాయలు చొప్పున ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశార.వరి ధాన్యానికి సన్న రకానికి 500 బోనస్ చెల్లిస్తాం అనడం రైతులను మోసం చేయడమే.సన్న రకం వడ్లకు మార్కెట్లో మూడు వేలకు పైగా ధర ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామనడం న్యాయమైన దా అని కాంగ్రెస్ పార్టీని ,రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం .కాంగ్రెస్ పార్టీ హామీలు రైతంగానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు .కానీ ఆరు నెలలు కూడా పూర్తికాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కుతుంది. మాట మారుస్తుంది .ఇప్పటికే పెన్షన్లు కానీ పేద మహిళలకు 2500 నెల నెల ఇస్తామనడం కానీ ,రైతాంగానికి 15000 రూపాయలు రైతు బంధు కింద చెల్లిస్తామని చెప్పడం కానీ ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఎప్పటినుండి అమలు చేస్తామని చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుతున్నది .నిర్దిష్టంగా డేట్లు ప్రకటించాలని రైతాంగాన్ని ప్రజల్ని మోసం చేసే కుట్రని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రజలకు జవాబు దారిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని సిపిఎం నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది
ఈ కార్యక్రమంలో.
దుర్గం నూతన్ కుమార్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, డాకుర్ తిరుపతి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, చందుల సాయికిరణ్. నిర్మల్ పట్టణ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking