ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 అవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక భాగ్యనగర్ లో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు