జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం భారతీయుల కోసం ‘భారతీయుల వాయిస్’గా పనిచేయగల రాజకీయ వేదికను ఏర్పాటు చేయడం, తద్వారా భారతీయుల మనోవేదనలు బ్రిటీష్ వారికి చేరతాయని భావించిన ఏ ఒ హ్యుమ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి1885లో ఐ ఎన్ సీ ని స్థాపించారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గుర్తు చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో పార్టీ శ్రేణులతో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐ ఎన్ సీ కి ముందు దీనిని ఇండియన్ నేషన్ యూనియన్ గా ఉండేదని తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ ముందున్న సంస్థలన్నీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఏర్పడినవే అని అవన్నీ ఏదో ఒక ప్రాంతానికి పరిమితమై స్థానిక సంస్థల పట్ల దృష్టి సారించాయి యని తెలియజేసారు.అయితే జాతీయస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కొందరు జాతీయ నాయకులు గుర్తించి దీంతో దూరదృష్టి కలిగిన రాజకీయవేత్తలు దేశవ్యాప్త సంస్థను ఏర్పాటు చేయాలని భావించారనీ గుర్తు చేశారు. అలా ఏర్పాటు చేయబడిన భారత జాతీయ కాంగ్రెస్ నేటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మనుషుల మధ్య ప్రేమానురాగాలను పంచేందుకు శత విధాల ప్రయత్నిస్తుందని తెలిపారు. నాడు ఇందిరాగాంధీ సారథ్యంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు గరేబి హఠావో నినాదం ఇస్తే నేడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ సారధ్యంలో ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని తెలిపారు. ఆల్ ఇండియా కాంగ్రెస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచనలను పాటిస్తూ కాంగ్రెస్ లక్ష్యాన్ని చేరేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా INTUC అద్యక్షులు కొత్తా సీతారాములు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, వడ్డెబోయిన నరసింహారావు, రామూర్తి నాయక్, సాధు రమేష్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ నాయకులు B H రబ్బానీ,జిల్లా మైనారిటీ, కిసాన్ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చోటా బాబా,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, బోజెడ్ల సతీష్, కార్పోరేటర్లు లకావత్ సైదులు నాయక్, దుద్దుకూరి వేంకటేశ్వర్లు, మలీదు వేంకటేశ్వర్లు, వైరా LDM కో ఆర్డినేటర్ మద్దినేని రమేశ్,నగర కాంగ్రెస్ నాయకులు మందడపు మనోహర్, నాగుల్ మీరా, పాకాలపాటి శేషగిరి, కూల్ హోమ్ ప్రసాద్, గజ్జెల్లి వెంకన్న, గజ్జి సూర్యనారాయణ, భానోత్ వినోద, బాణాల లక్ష్మణ్, అబ్బాస్ భేగ్ ,గుత్తా ద్రౌపది, దామా స్వరూపా, సుగుణ, సంపటం,నరసింహారావు, వడ్డె బోయిన శ్రీనివాస్, బోడా శ్రావణ్, బండి నాగేశ్వరరావు, తవిడబోయిన రవి, వాశిం, మహమూద్, అబ్దుల్ అహద్, ముజాహిద్,G ఆనందరావు, కందుల శ్రీను, బచ్చలకూర నాగరాజు, అంజని కుమార్,బోజెడ్ల సతీశ్, అక్కినేని పూర్ణచందర్రావు, రమేశ్, సరోజినీ,కృష్ణయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.