గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
జాగ్రత్తలు పాటించక మట్టిపాలైన అనేక చారిత్రక పుస్తకాలు
– సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్
ఖమ్మం ప్రతినిధి జనవరి 13 (ప్రజాబలం) ఖమ్మం రాత్రి కూలిపోయిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని సిపిఎం జిల్లా నాయకత్వం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా జిల్లా గ్రంథాలయానికి ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. గత 3 ఏండ్ల క్రితం ఈ గ్రంథాలయం భవనాన్ని పరిశీలించి కూలిపోతుందని అధికారులు తేల్చారని పేర్కొన్నారు. అయినా జాగ్రత్తలు తీసుకోకుండా కనీసం విలువైన పుస్తకాలను భద్రపర్చకుండా గ్రంథాలయ కమిటి అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ ప్రమాదం సెలవు రోజు జరగటం వలన పెను ప్రమాదం తప్పిందని లేకుంటే ఉద్యోగులు, రీడర్స్‌కు ప్రాణాపాయం జరిగి ఉండేదని అన్నారు. అనేక విలువైన పుస్తకాలు నేలమట్టమైనాయని పేర్కొన్నారు. ఈ నష్టానికి ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని, జిల్లా ప్రజలకు అందుబాటులోకి తక్షణమే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు సందర్శించిన వారిలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, జిల్లా నాయకులు మాదినేని రమేష్, తుశాకుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.