ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిధిలోని ఘట్కేసర్ మండలం కాచవని సింగారం గ్రామంలోని సర్వే నెంబర్ –66ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పరిధిలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది అందులో కబ్జాకు గురైందా… అనే వివరాలను క్షుణ్ణంగా తెలుసుకొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, వాటిల్లో గుడిసెలు, తదితరాలు ఉన్నట్లయితే వెంటనే తొలగించాలని అలా చేయనట్లయితే ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల్లో సర్వే నెంబర్లు, ప్రభుత్వ భూమి అని తెలిసేలా వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని… దీంతో పాటు ఫెన్సింగ్ సైతం చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి అధికారులు ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking