దళిత బంధు రెండో విడత బాధితుల సమావేశం

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 5

జమ్మికుంట లో ఓ ప్రైవేట్ గార్డెన్ లో దళితబందు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దళితబందు రెండవ విడత రాని బాధితుల సమావేశం నిర్వహించిడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ విడత నిధులపై ఏలాంటి ప్రకటన చేయకుండా కాలయాపన చేస్తుంది 10 నెలలుగా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమలు చేస్తున్న అక్రమ అరెస్టులు చేసి నిర్భందిస్తుంది ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసి అనేక ఇబ్బందులకు గురించేస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉధ్యేశం హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారుగా 5000 కుటుంబాలకు రెండవ నిధులు రావాల్సి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధి లేకుండ వ్యవహరిస్తుంది. గతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబందు పైలెట్ ప్రాజెక్టు ని పూర్తి స్థాయిలో మంజూరు చేయడంలో విఫలం అయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దళితులకు రావాల్సిన రెండవ విడత నిదులను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలనీ కోరుకుంటున్నాం. లేని పక్షంలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి మొదలుకొని రాష్ట్ర వాప్తంగా ఆందోళగా కార్యక్రమలు చేయడానికి దళితులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking