భారాస కార్వాన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎ. కృష్ణయ్య
హైదరాబాద్ ఆగష్టు 28 ;అన్ని వర్గాలతో పాటు దళితుల సంపూర్ణ మద్దతుతో కార్వాన్ ఎమ్మెల్యేగా తాను విజయం సాధించడం ఖాయమని భారాస పార్టీ కార్వాన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎ. కృష్ణయ్య (మిత్రకృష్ణ) దీమా వ్యక్తం చేశారు. జియాగూడ ఇందిరానగర్ కు చెందిన అదిజాంబవ సంక్షేమ సంఘం, ఇందిరానగర్ నల్లపోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయ కమిటీ ప్రతినిధులు ఎమ్. రఘునాథ్, టి.యాదయ్య, ఎమ్ కిషన్, జి.చెన్నయ్య ఎమ్. బాలకృష్ణ, ఎస్. అనిల్కుమార్, సి. వెంకటేశ్, ఎమ్. సత్యనారాయణ, ఎమ్ వెంకటేశ్ తదితరుల బృందంతో పాటు పలు దళిత సంఘాల ప్రతినిధులు కలిసి మిత్రకృష్ణకు శాలువా, పూలమాలలతో సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్వార్ అసెంబ్లీ సెగ్మెంట్లో బారాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దళితుడైన మిత్రకృష్ణకు టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం కార్వాన్లోని దళితుల ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపజేసిందని ఆనందం వ్యక్తం చేశారు. మిత్రకృష్ణను ఎమ్మెల్యేగా అభిండ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిత్రకృష్ణ మాట్లాడుతూ కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 7వేలకు పైగానే దళితుల ఓటు బ్యాంకు ఉందని, ఆ ఓటే తన విజయానికి శ్రీరామరక్షగా విలువనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని దళిత సంఘాల ప్రతినిధుల మద్దతు కోరనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బారాస యువనేత అభిషేక్, ఉమేష్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post